Header Banner

ఏపీ రైతులకు అలర్ట్! వెంటనే ఇలా చెయ్యకపోతే ఏ పథకాలూ రావు!

  Tue Feb 04, 2025 09:04        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. టెక్నాలజీని వాడుకునే విషయంలో ఎదురయ్యే ఏ అవకాశాన్నీ వదలట్లేదు. ఇందులో భాగంగా.. తాజగా రైతుల విషయంలోనూ టెక్నాలజీని వాడేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి.. కొత్త విధానం తెచ్చింది. ఇందులో రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ సంఖ్య ఉన్న రైతును మాత్రమే రైతుగా గుర్తిస్తారు. ఈ సంఖ్య లేకపోతే, ఆ రైతుకి వచ్చే ఎలాంటి ప్రయోజనాలూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావు. 

 

అసలు ఏపీ ప్రభుత్వం సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? ఇది రైతులకు కొత్త తలనొప్పి కాదా? అనే అనుమానం మనకు రావచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటే.. అసలు రైతుల బదులు.. నకిలీ రైతులు, బినామీలూ ఆ ప్రయోజనాలు పొందేస్తున్నారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. దీనికి చెక్ పెట్టేందుకే కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్యను తెచ్చింది. దాన్ని ఏపీలో అమలు చెయ్యడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఫార్మర్‌ రిజిస్ట్రీ పేరుతో.. రైతుల వివరాల్ని నమోదు చేస్తోంది. ఏపీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా.. ఇదే పని మొదలుపెట్టింది. ఇప్పుడు ఏపీలో భూమి ఉన్న ప్రతి రైతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు రాయించుకోవాలి. కొన్నాళ్ల తర్వాత కౌలు రైతులకూ, భూమిలేని వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అనుబంధ వృత్తిదారులకు కూడా నమోదు ప్రక్రియ చేపడతారు. 

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తమ పేరు రాయించుకోవడం కోసం రైతులు.. రైతు సేవా కేంద్రంకి వెళ్లాలి. ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు కూడా నమోదు చెయ్యాలి అని కోరాలి. వాళ్లు వాళ్ల దగ్గర ఉండే ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసి.. రైతుల పేరు, ఊరు, అడ్రెస్, ఆధార్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వంటి వివరాల్ని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఒకవేళ RSKకి వెళ్లలేకపోతే.. ఆ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగులకు కాల్ చేసి.. వివరాలు చెప్పి.. తర్వాత ఓటీపీ చెప్పి, అలా కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవచ్చు. 

 

ఆ విశిష్ట గుర్తింపు సంఖ్యను రైతు తన మొబైల్ ద్వారా ఫొటో తీసుకోవచ్చు. లేదా ఓ పేపర్‌పై రాసుకోవచ్చు. ఆ సంఖ్యను ఇంటికి తీసుకెళ్లి.. భద్రంగా దాచుకోవాలి. ఎందుకంటే.. భవిష్యత్తులో ప్రతీ దానికీ ఆ సంఖ్యను అధికారులు అడుగుతారు. అది లేదంటే.. రైతుగా గుర్తించరు. ఒకవేళ ఆ గుర్తింపు సంఖ్యను మర్చిపోయినా, పోగొట్టుకున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. RSKకి వెళ్లి.. పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ చెబితే.. వారు సెర్చ్ చేసి, విశిష్ట గుర్తింపు సంఖ్యను చూపిస్తారు. 

 

ప్రయోజనాలు: ఈ విశిష్ట సంఖ్య ఉన్న రైతులనే ఇకపై రైతులుగా అధికారులు గుర్తిస్తారు. తద్వారా వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చే పంటల బీమా, పంటనష్ట పరిహారం, పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు వంటివి లభిస్తాయి. అంతేకాదు.. ఈ సంఖ్య ఉన్న రైతులకు మాత్రమే.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల్ని కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి రైతులకు మాత్రమే అధికారులు సలహాలూ, సూచనలూ ఇస్తారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP